30-09-2025 12:00:00 AM
దశాబ్దాల కాలంగా.. ఆ గ్రామాల పరిస్థితి అదోగతి
వర్షం పడిందంటే బయటి ప్రపంచంతో సంబంధం కట్
ఖానాపూర్, సెప్టెంబర్ 29 (విజయ క్రాం తి): తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన గిరిజన నియోజకవర్గం నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం కాగా ఈ నియోజకవర్గం దశాబ్దాల కాలంగా అభివృద్ధిలో వెనుకబడి ఉందంటే అతిశయోక్తి కాదు. పార్టీలు ప్రభుత్వాలు మారిన, ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చినా ఈ నియోజకవర్గంలోని గిరిజనుల బ్రతుకు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటుందన్నది నిజం.
కాగా నియోజకవర్గంలోని పెంబి మండలంలో అత్యధికంగా గిరిజన గ్రామాలు అడవుల్లో కొండల్లో ఉంటాయి. ఇవి పూర్తిగా గోండు గిరిజన గ్రామాలే. ఈ గ్రామాల ప్రజలను ప్రతి ఎన్నికల్లో నాయకులు ఓట్లు దండుకోవడం కోసమేనని అనంతరం తమను పట్టిం చుకున్న నాయకులు కానరాడని అక్కడ గ్రామాల్లో స్థానిక ప్రజలు వాపోతూ ఉంటా రు.
ఏదైనా అభివృద్ధి పథకం మంజూర అయింది అంటే మధ్యవర్తులు, కాంట్రాక్టర్లు, నాసిరకం పనులు చేయడంతో ఇక్కడి గ్రామాల్లో కమ్యూనిటీ హాల్లు, పాఠశాల భవనాలు, రోడ్లు, వంతెనలు, ఎప్పుడు కూల్తా యో తెలియని పరిస్థితి .ఈ నేపథ్యంలో గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో మండలంలోని పసుపుల గ్రామం వద్ద ఉన్నటువంటి వాగు మీద రూ. కోట్ల రూపాయల నిధులతో వంతెన మంజూరు అయింది.
అప్పటి ప్రభు త్వ హయాంలోనే వంతెన నిర్మాణం ప్రారంభమైంది. దాదాపు పూర్తి కావస్తున్న తరు ణంలో అప్పటి ఎన్నికల ముందర కురిసిన భారీ వర్షాలకు వాగులో భారీ ప్రవాహానికి ఆ వంతెన కొట్టుకు పోయింది. అనంతరం ఎన్నికల్లో ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటినుంచి ఈ వంతెనను పట్టించుకున్న నాధుడు లేడు.
వంతెన నిర్మాణంతో వాగు అవతల ఉన్న యంగ్లాపూర్, యాపల్ గూడా ,వసుపల్లి, దొందరి, చాకిరేవు, గుమ్మెన ,యంగ్లాపూర్ రాంనగర్, గ్రామపంచాయతీల తో పాటు అనేక అనుబంధ గ్రామాలకు వంతెన సౌకర్యం సమకూరుతుందని అక్కడ గిరిజనులు భావించారు. ఈ వంతెన కూలిన నేపథ్యంలో అప్పట్లో కాంట్రాక్టర్ పై అనేక ఆరోపణలూ వచ్చాయి .అక్కడ స్థానిక నాయకులు, అప్పటి ఎమ్మెల్యే కుమ్మక్కై ఈ పనులు నాసిరకం చేశారని ,అందుకే వరద ప్రవాహానికి వంతెన కొట్టుకుపోయిందని, పలు ఆరోపణలు ఉన్నాయి.
ఏది ఏమైనా వాగులపై వంతెన రహదారి సౌకర్యం లేకపోవడంతో ఇక్కడి గిరిజన గ్రామాల ప్రజలు వైద్య సౌకర్యానికి నోచుకోక, సిబ్బంది ఆ గ్రామాలకు వెళ్తామంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగులు దాటాల్సి వస్తుంది.
ఇక ఉపాధ్యాయుల మాట అంతే సంగతి ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో తమ గ్రామాలకు వంతెన సౌకర్యం కల్పించి ఓట్లు అడగాలని గిరిజనులు ఆందోళన చేసే క్రమంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇకనైనా ప్రభుత్వాలు స్పందించి గిరిజనులకు కావలసిన అభివృద్ధి పథకాలను అందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.