22-10-2025 05:09:36 PM
లక్షేట్టిపేట (విజయక్రాంతి): ప్రత్తి కొనుగోలుకు నూతన విధానంలో భాగంగా కపాస్ కిసాన్ అనే యాప్ వినియోగించుకునే విధానంపై రైతులకు అగ్రికల్చర్ అధికారులు బుధవారం మండలంలోని డౌడేపల్లి గ్రామ పంచాయతీలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నూతనంగా ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ యాప్ పోస్టర్స్ ను ఏఈఓ సాయిని శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగ ఆయన మాట్లాడుతూ... పత్తి రైతులు మీ యొక్క పాత మొబైల్ నెంబర్ లు పని చేయని యెడల ప్రస్తుతం ఆధార్ కు లింక్ ఉన్న కొత్త ఫోన్ నెంబర్ ను అందరూ మార్చుకోవాలని కపాస్ కిసాన్ అనే యాప్ ద్వారా రైతులు స్లాట్ బుక్ చేసుకొని సీసీఐ సెంటర్ లో ప్రత్తి విక్రయించాలని అన్నారు.
రైతులు స్మార్ట్ ఫోన్ లోని ప్లే స్టోర్ నుండి కపాస్ కిసాన్ అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని, మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దని అన్నారు. పత్తి విక్రయాలలో యాప్ వినియోగంలో సందేహాలు ఉంటే తమను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ కొత్త సుజాత, టెక్నీకల్ అసిస్టెంట్ బి. రాజన్న, రైతులు పాల్గొన్నారు.