22-10-2025 05:12:24 PM
శివాలయాల్లో ప్రత్యేక పూజలు..
సుల్తానాబాద్ (విజయక్రాంతి): పరమశివుడికి ఎంతో ఇష్టమైన కార్తీక మాసోత్సవ వేడుకలు బుధవారం సుల్తానాబాద్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శివాలయాల్లో పూజార్లు అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకొని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్తీకమాసం నెలరోజుల పాటు శివాలయాల్లో ప్రత్యేక పూజలు ఉంటాయని తెలిపారు. ప్రజలందరూ ఇంటి వద్ద భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగిస్తూ శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ కార్తీక మాసం అందరం శాంతి.. సౌభాగ్యం.. ఆరోగ్యంగా ఉండాలని శివుడి వద్ద ప్రత్యేకంగా భక్తులు కొలుస్తుంటారు. పూజారులు పారువెళ్ల రమేష్, వల్ల కొండ మహేష్, పోలస అశోక్ లు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే సుల్తానాబాద్ మండలంలోని గ్రామాల్లోనూ ఈ నెల రోజుల పాటు కార్తీక మాసమును పురస్కరించుకొని భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు.