29-12-2025 07:45:14 PM
కిడ్స్ కళాశాల చైర్మన్ నీల సత్యనారాయణ
కోదాడ: కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సిఎస్సి, సివిల్ విద్యార్థినులకు ప్రముఖ బహుళ జాతి సంస్థ అయిన ఐబీమ్ వారి ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అవగాహన సదస్సు నిర్వహించినట్టు కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ సోమవారం తెలిపారు. ఐబీమ్ సీనియర్ శిక్షకులు సాయి రాఘవేంద్ర, గౌతమీ హాజరై విద్యార్థినులకు కృత్రిమ మేధ ప్రయోజనాలు విపులంగా వివరించారు.
కృత్రిమ మేధ వల్ల సమయం ఆదవుతుందని, గణితం, కోడింగ్, టెస్టింగ్, డి.బగ్గింగ్ వంటి పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయడం వలన విద్యార్థినులు సృజనాత్మకతపై దృష్టి సాధించగలరని అన్నారు. భారీ డేటాను వేగంగా విశ్లేషించడం ద్వారా ప్రాజెక్ట్స్, పరిశోధన పత్రాలు, ఫైనల్ ఇయర్ ప్రాజెక్టులను ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ద్వారా రీసెర్చ్ లో ఎంత గానో సహాయ పడుతుందని అన్నారు.
ఇఫిషియల్ ఇంటిలిజెన్స్ పరిజ్ఞానం వల్ల విద్యార్థినులు ఇండస్ట్రీ అవసరాలకు అనుకూలంగా సిద్ధమవుతారని అన్నారు. సిఎస్సి, ఈసీఈ, ఎలక్ట్రికల్, సివిల్, ఇంజనీరింగ్ వంటి అన్ని శాఖల్లో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ఉపయోగ పడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళ పల్లి గాంధీ, డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.