25-08-2025 05:52:10 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని కేర్చిపల్లి గ్రామంలో నానో యూరియా వాడకంపై క్షేత్రస్థాయిలో రైతులకు ఏఈఓ సాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘన రూపంలో ఉన్న యూరియాకి ప్రత్నామ్నాయంగా ద్రవ రూపంలో ఉన్న నానో యూరియాని వాడడం వలన తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిలో సాధించవచ్చు అని వివరించారు.
అదేవిధంగా పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఉపయోగించ వచ్చని పంట పొలాలలో నానో యూరియాని పిచికారి చేయడం వలన మొక్కలకు కావాల్సిన నత్రజని సమర్థవంతంగా వినియోగించుకొని ఎదుగుదలకు ఉపయోగ పడుతుందని దీనిని నిల్వ చేసుకోవడం, రవాణా చేసుకోవడం కూడా సులభం అని అన్నారు. ఒక ఎకరానికి స్ప్రే చేయడానికి 500 ఎం ఎల్ నానో యూరియా అవసరపడుతుందని రైతులకు వివరించారు.