25-08-2025 05:55:38 PM
వలిగొండ,(విజయక్రాంతి): రెండు రోజులలో రాబోయే వినాయక చవితి పర్వదినం కోసం వినాయక విగ్రహాలు మండపాలకు తరలి వెళ్తున్నాయి. ఈనెల 27న వినాయక చవితి పురస్కరించుకొని గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసే వినాయక మండపాలకు పిల్లలు, పెద్దలు, యువకులు, వివిధ యువజన సంఘాలు ఎటు చూసినా వినాయక ప్రతిమలను కొనుగోలు చేసి వాహనాలను తరలిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పండుగ మరొక రెండు రోజుల్లో ఉండడంతో వలిగొండ మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. వినాయక ప్రతిమలు మండపాలకు డీజే, డప్పు చప్పుళ్ళు, బాణాసంచాతో మండపాలకు తీసుకువెళ్తున్నారు.