12-07-2025 05:33:02 PM
బెజ్జంకి: రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో స్వీట్లు పంపిణీ చేసి బాణసంచాలు కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని నిరూపితమైందన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందన్నారు. బీసీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దామోదర్, మండల అధ్యక్షులు ముక్కిసా రత్నాకర్ రెడ్డి, చిలువేరు శ్రీనివాస్ రెడ్డి , కర్రావుల శంకర్ బిసి సెల్ అధ్యక్షులు గూడెల్లి శ్రీకాంత్ ముదిరాజ్, మండల యూత్ ప్రెసిడెంట్ సందీప్ ,ఎస్సీ సెల్ కొంకటి రాములు మైనారిటీ సెల్ ఎండి జహంగీర్ ఆలయ చేర్మెన్ జెల్ల ప్రభాకర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కరవేణి పోచయ్య, చెప్పాల శ్రీనివాస్ ,డైరెక్టర్లు పులి సంతోష్, మచ్చ కుమార్, మధుసూదన్ రెడ్డి, పర్శ సంతోష్ ,లింగాల శ్రీనివాస్, పులి రమేష్, బొనగం రమేష్, రామచంద్రం,తాజా మాజీ ప్రజా ప్రతి నిధులు గ్రామ శాఖ అధ్యక్షులు బిసి సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.