calender_icon.png 13 July, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్సాహంగా సాగిన ఫ్రెండ్లీ పోలీస్ ప్రెస్ క్రికెట్ మ్యాచ్

12-07-2025 05:09:45 PM

క్రికెట్ మ్యాచ్ను ప్రారంభించి జిల్లా ఎస్పీ..

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): శనివారం జిల్లాలోని స్థానిక కళాశాల మైదానంలో పోలీస్, ప్రెస్ మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. మొదటగా పోలీస్ ఏ టీమ్, సిరిసిల్ల ప్రెస్ మధ్య జరిగిన మ్యాచ్ లో పోలీస్ ఏ టీమ్ గెలుపొందగా, రెండవ మ్యాచ్ లో పోలీస్ బి టీమ్ వేములవాడ ప్రెస్ మధ్య జరుగగా వేములవాడ ప్రెస్ టీమ్ గెలుపొందగా ఫైనల్ మ్యాచ్ పోలీస్ ఏ టీమ్ వేములవాడ ప్రెస్ టీమ్ అడగా మొదట బ్యాటింగ్ చేసిన పోలీస్ ఏ టీమ్ నిర్ణిత 10 ఓవర్లలో 77 పరుగులు చేయగా వేములవాడ ప్రెస్ జట్టు నిర్ణిత 10 ఓవర్లలో 73 పరుగులు చేయగా పోలీస్ ఏ టీమ్ 4 పరుగుల తేడాతో గెలుపొందడం జరిగింది. 

మొదటి ప్లేస్ పోలీస్ ఏ టీమ్, రెండవ ప్లేస్ వేములవాడ ప్రెస్ టీమ్, మూడవ ప్లేస్ సిరిసిల్ల ప్రెస్ టీమ్. అనంతరం జట్ల సభ్యులకు జిల్లా ఎస్పీ బహమతులు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని నిత్యం బిజీగా ఉండే పోలీసులు, జర్నలిస్టులు కొంత సేపు ఆహ్లాదకరంగా గడిపారని అన్నారు. ప్రెస్, పోలీసుల మధ్య మంచి సస్సబంధాలు ఉండడానికి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగిందని. ప్రతి సంవత్సరం ఒక సారి ఈ విధంగా క్రికెట్ మ్యాచ్  నిర్వహించడం ద్వారా ప్రతి ఒక్కరికీ ఆటవిడుపుతో పాటు మంచి టీమ్ స్పిరిట్  వస్తుందని అభిప్రాయపడ్డారు. క్రికెట్ మ్యాచ్ ప్రారంభించే ముందు సిరిసిల్ల రిపోర్టర్ ప్రసాద్ ఇటీవల గుండెపోటుతో మరణించగా రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.