12-07-2025 05:13:12 PM
ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి..
హాలియా (విజయక్రాంతి): పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి(MLA Kunduru Jayaveer Reddy) అన్నారు. శనివారం మండలంలోని హజారిగూడెం గ్రామంలో 85 మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నియోజకవర్గంలో ఒక్కరికి కూడ ఇళ్ళు ఇవ్వకుండా మాయ మాటలతో మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. 2008లో హజారిగూడెం గ్రామ ప్రజలకు తన తండ్రి జానారెడ్డి ఇచ్చిన మాట నేడు సాకారం అయిందని తెలిపారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలో మొదటి విడతగా 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇల్లు రాని నిరుపేదలు నిరుత్సాహం చెందవద్దని అర్హులైన ప్రతి ఒక్కరికి మరో విడతలో వస్తాయని చెప్పారు.ఇచ్చిన హామీలను నెరవేర్చి మళ్ళీ ఎన్నికల్లో ఓటు అడుగుతానని శపథం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్ కలసాని చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు కుందూరు వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎడవల్లి నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రావుల రాంబాబు,పిఎసిఎస్ చైర్మన్ రిక్కల సుధాకర్ రెడ్డి, రావుల శ్రీనివాస్ యాదవ్, కుంటి గొర్ల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, రాజా రమేష్ యాదవ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు మజహర్ మోహినుద్దీన్, యువజన కాంగ్రెస్ నాయకుడు మల్ రెడ్డి భానుచందర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ షేక్ గౌస్, నకిరేకంటి సైదులు మాదిగ, తాహాసిల్దార్ రఘు, ఆర్ఐ నవీన్ తదితరులు పాల్గొన్నారు.