calender_icon.png 13 July, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42% హర్షణీయం

12-07-2025 05:04:12 PM

కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం..

జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్..

బీబీపేట్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినేట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం సాహసోపేతమైనదని జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల వైపు అడుగుపెట్టడం ఒక విప్లవాత్మక నిర్ణయమని ఆయన అన్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు బీసీ డిక్లరేషన్ కట్టుబడి కులగణన చేసిందని గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అమలుకు అవసరమైన ఆర్డినెన్స్ తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం యావత్ బీసీలు స్వాగతించే అంశమన్నారు. 2018 చట్టాన్ని సవరించి బీసీలకు న్యాయం చేసే దిశగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేసిన ప్రకటనను ఆయన "సామాజిక విప్లవానికి నాంది"గా కొనియాడారు.

బీసీ వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఇదే నిదర్శనమన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ  భారత్ జోడో యాత్రలో చేసిన "జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలి" అన్న డిమాండ్‌ను దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రజా పాలనలో అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. తెలంగాణ సమాజం, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని అమలు పరచేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రివర్గానికి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీకి, టి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.