19-05-2025 12:00:00 AM
జిల్లా సివిల్ సప్లై అధికారి మల్లికార్జున బాబు
కామారెడ్డి, మే 18 (విజయ క్రాంతి), రైతుల నుంచి సేకరించిన ధాన్యం లారీల అన్లోడింగ్ వేగవంతం చేయాలని జిల్లా సివిల్ సప్లై అధికారి మల్లికార్జున బాబు అన్నారు. ఆదివారం ఆయన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని పలు రైస్ మిల్లులను తనిఖీ చేశారు. ధాన్యం నిల్వల గురించి రైస్ మిల్లర్లను అడిగి తెలుసుకు న్నారు.
రైస్ మిల్లులో నిల్వ లేకుండా చూడాలని ఆయన సూచించారు. రైస్ మిల్లుల యజమానుల వల్ల రైతులకు ఇబ్బం దులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ తాసిల్దారు ఆదేశించారు. ఆయన వెంట సివిల్ సప్లై శాఖ డిఎం రాజేందర్ తాహసిల్దార్ శివప్రసాద్ పాల్గొన్నారు.