calender_icon.png 20 May, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యరగని గురవయ్య మరణం తీరని లోటు

19-05-2025 12:00:00 AM

హుజూర్‌నగర్, మే 18: హుజూ ర్‌నగర్ పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ యరగాని గురవయ్య బ్రెయి న్ స్ట్రోక్ తో హైదరాబాద్ గ్లోబల్ ప్రైవేట్ హాస్పిటల్లో మరణించడం జరిగింది.ఈ విషయం తెలిసిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  దిగ్భ్రాంతికి గుర య్యారు. మంత్రి  హుజూర్నగర్ చేరు కొని మాజీ కౌన్సిలర్ యరగని గురవ య్య పార్థివదేహం పై మూడు రంగుల జెండా ఉంచి, పూలమాలవేసి  నివాళులర్పించారు.

అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ  యరగని గురవయ్య మరణం పార్టీకి తీరని లోటని మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని,అలాంటి వ్యక్తి ఈరోజు మనకు దూరం అవటం చాలా బాధాకరమని అన్నారు. యరగని గురవయ్య   కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

యరగని గురవయ్య  కుటుంబానికి పార్టీ ఎప్పుడు అండగా  ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సాముల శివారెడ్డి, యరగాని నాగన్న, తన్నీరు మల్లికార్జున్,గెల్లి రవి అమరబోయినసతీష్, వీర్లపాటి భాస్కర్, యడ్ల విజయ్,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.