7 May, 2026 | 2:36 AM

నిర్మల్ మార్కెట్‌లో ఆందోళన

07-05-2026 12:49 AM

రోడ్ ఎక్కిన ధాన్యం రైతులు 

జాతీయ రహదారిపై నాలుగు గంటల రాస్తారోకో 

నిర్మల్ మార్కెట్లో నిలదీత 

నిర్మల్ మే6 (విజయక్రాంతి): రైతులు పండించిన వరి జొన్న మొక్కజొన్న కొనుగోలు చేయాలని బుధవారం రైతులు వివిధ చోట్ల ఆందోళన నిర్వహించారు. దిల్వార్పూర్ మండలం గుండంపెల్లి క్రాస్ రోడ్ వద్ద బైంసా నిర్మల్ జాతీయ రహదారిపై సుమారు 200 మంది రైతులు నాలుగు గంటల సేపు బైఠాయించారు.

ఉదయం 9 గంటల నుంచి ఒంటిగంట వరకు ఎండలు సైతం లెక్కచేయకుండా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో ఇరువైపులా కిలోమీటర్ల పొడుగులో వాహనాలు నిలిచిపోయాయి. రైతుల పండించిన ధాన్యం పంట కళ్ళల్లో పోసుకొని కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నామని కొనుగోలు జాప్యం చేస్తున్నారని వారు ఆరోపించారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న ఆర్డిఓ రత్నా కల్యాణి తాసిల్దార్ ఎజాస్ అహ్మద్ డిఎస్పి ఎస్త్స్రలు సంఘటన స్థలానికి చేరుకుని రాస్తారోకో విరమించేందుకు ప్రయత్నించారు. కలెక్టర్ వచ్చి సమస్య పరిష్కరించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని రైతులు తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి దాన్యం కొనుగోలను వెంటనే ప్రారంభించి వేగంగా పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు 

మార్కెట్ కార్యాలయం వద్ద ధర్నా 

నిర్మల్ పట్టణంలోని మార్కెట్ కార్యాలయం ముందు వరి మొక్కజొన్న దాన్నే కొనుగోలను జాప్యంపై రైతులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి నేతలు మారా గంగారెడ్డి రైతు సంఘం నాయకులు తరలివచ్చి మద్దతు పలికారు. కొనుగోలు ప్రారంభించి నెల రోజులైనా కొనుగోళ్లలో జాప్యం కారణంగా తమ పంటలు నష్టపోతున్నాయని సంచులు లేవని లారీల కుర్తా తీవ్రంగా ఉందని నినాదాలు చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ రామ్ రెడ్డి అక్కడికి చేరుకొని సమస్యల జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు ఈ కార్యక్రమంలో రమణారెడ్డి రైతులు ఉన్నారు.