28-10-2025 12:12:37 AM
ఎర్రుపాలెం అక్టోబర్ 27 ( విజయక్రాంతి) : ఎర్రుపాలెం మండలం తాసిల్దార్ కార్యాలయం ముందు రైతుల సమస్యలపై రైతు సంఘం జిల్లా నాయకులు గొల్లపూడి పెద్ద కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుల దివ్వెల వీరయ్య,మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు మాట్లాడుతూ సిపిఎం ఎర్రుపాలెం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో గత పది రోజులుగా వివిధ గ్రామాలలో క్షేత్రస్థాయిలో వివిధ పంటలు పరిశీలన, రైతు సమస్యలను సర్వే చేయటం జరిగిందని ఈ సమస్యలను వినతి పత్రం మండల అధికారికి అందించడం జరిగిందన్నారు.
సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షాలను ప్రకృతి వైపరీతంగా గుర్తించి ఎర్రుపాలెం కరువు మండలంగా ప్రకటించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత పంట బీమా పథకం అమలుచేస్తానని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నా నాలుగు సీజన్లలో పంట దెబ్బతిన్న పండించిన పంటలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా తుడిచిపెట్టుకుపోతున్న ఇచ్చిన పంట బీమా హామీని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తుందని. దీంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా రైతులు నిలువునా మునిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే పంట బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని సిసిఐ పత్తి తేమ శాతం నిబంధను ఎత్తివేసి ఆంక్షలు లేకుండా మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయాలన్నారు.మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని పెండింగ్ లో ఉన్న సన్న వడ్ల బోనస్ రైతులు ఖాతాలో వేసి రాబోయే దాన్యం ప్రభుత్వానికె అమ్ముకునే భరోసా కల్పించాలన్నారు. రైతు ఋణ మాఫీ చేయాలని భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ మండల కమిటి సభ్యులు నల్లమోతు హనుమంతరావు, దూదిగం భసవయ్య,షేక్ లలా,షేక్ నాగుల మీరా,లగడపాటి అప్పారావు, కన్నెబొయిన శ్రీనివాస్, కుడెలి నాగేశ్వరావు, తాళ్లూరి వెంకట నారాయణ,తల్లపురెడ్డి వెంకట రెడ్డి, కరీం, సుబ్బ రెడ్డి, పుల్ల రావు, కోటేశ్వరరావు, శీలం వెంకటేశ్వరరావు, కోoడెపాటి శివయ్య, రైతులు పాల్గొన్నారు.