calender_icon.png 14 December, 2025 | 7:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నమ్మి ఓటేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోండి!

13-12-2025 01:52:37 AM

  1. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా నిలబడండి

కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు 

కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్

నల్లవల్లి సర్పంచ్, కానుకుంట వార్డ్ సభ్యులకు ఘన సన్మానం

పటాన్ చెరు, డిసెంబర్ 12 :గ్రామపంచాయతీ ఎన్నికల్లో నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామానికి అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అండగా నిలబడాలని నూతన సర్పంచ్ లు, వార్డ్ సభ్యులకు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ సూచించారు. గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఎన్‌ఎంఆర్ యువసేన అభ్యర్ధిగా ఘనవిజయం సాధించిన నల్లవల్లి నూతన సర్పంచ్ కోర్వి రాణి సురేష్,

కానుకుంట వార్డ్ సభ్యులు శుక్రవారం నీలం మధును చిట్కుల్లోని ఆయన క్యాంపు కార్యాలయంలో గ్రామస్థులతో కలిసి శాలువతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు, ఈ సందర్భంగా వారిని నీలం మధు ఘనంగా సన్మానించారు, గ్రామ ప్రజల ఆదరాభిమానాలు గెలుచుకుని సర్పంచ్ గా విజయం సాధించినందుకు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కార్యకర్త నుంచి నాయకులుగా ప్రస్థానం ప్రారంభిస్తున్న ప్రజా ప్రతినిధులు నిరంతరం ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కోసం ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన ప్రతి ఒకరికి గుర్తింపు దక్కుతుందని భరోసా ఇచ్చారు.

పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు, వార్డ్ మెంబర్లు గ్రామాభివృద్ధికి పాటుపడుతూ సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్తూ రాబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నల్లవల్లి వార్డ్ సభ్యులు నర్సింలు స్వరూప, కానుకుంట వార్డ్ సభ్యులు పోతురాజు నవీన్, ఎల్లబోయిన ప్రేమ్ దాస్, ఏళ్లబోయిన నాగరాజు, ఎర్రోల నరేష్ బాబు, కాంగ్రెస్ శ్రేణులు, ఎన్‌ఎంఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.