calender_icon.png 14 December, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి నెలా యూరియా అందించాలి: తుమ్మల

14-12-2025 01:21:49 AM

హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాం తి) : యాసంగి సాగు కోసం ప్రతి నెలా 2 లక్ష ల టన్నుల యూరియా అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. రాష్ట్రంలోని ఎరువుల నిల్వలపై మంత్రి తుమ్మల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రం లో 2.48 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు స్టాక్ ఉన్నాయని, ఈ నిల్వల స్థాయిని పెంచాలని అధికారులను ఆదేశించారు. యూరియా రవాణా ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి  లేఖ రాశామని తెలిపారు.