calender_icon.png 14 December, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా డబ్బు వాపస్ ఇచ్చేయండి!

14-12-2025 01:04:21 AM

  1. ఎన్నికల్లో మీరు నాకు ఓటేయలేదు
  2. వేస్తే దేవుడి మీద ప్రమాణం చేయండి
  3. ఇంటింటికీ తిరిగి అడిగిన ఓడిన అభ్యర్థి దంపతులు
  4. నల్లగొండ జిల్లా ఔరవాణి గ్రామంలో ఘటన

చిట్యాల, డిసెంబర్ 13 (విజయక్రాంతి): మొదటి విడత సర్పంచ్ ఎన్నిక ల్లో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిన అభ్యర్థి.. తాను పంచిన డబ్బును తిరిగి ఇవ్వాలంటూ ఓటర్లను కలిసి వసూలు చేశారు. అభ్యర్థి చేతిలో దేవుడి ఫొటో పట్టుకోగా, అతని భార్య పురుగుల మందు డబ్బాతో ఇంటింటికి తిరిగిన సంఘటన శనివారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఔరవాణి గ్రామంలో చోటు చేసుకుంది.

ఔరవాణి గ్రామంలో మొత్తం ఓట్లు 1490 ఉండగా, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి జక్కల పరమేష్‌కు 973 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్ బలపరిచిన కల్లూరి బాలరాజుకు 517 ఓట్లు వచ్చాయి. బాలరాజు ఓటుకు రూ.2 వేలు పంచినప్పటికీ 456 భారీ ఓట్ల భారీ తేడాతో ఓడిపోయాడు. ఇంత డబ్బు పంచినా మెజారిటీ రాకపోవడంతో బాలరాజు చేతిలో దేవుడు ఫొటో, అతని భార్య పురుగుల మందు డబ్బాతో ఇంటింటికి తిరిగి ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలని కోరారు.

నిజాయితీగా తమకు ఓటు వేసిన వారు దేవుడి మీద ప్రమాణం చేయాలని, వేయనివారు కచ్చితంగా తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వా లంటూ గ్రామస్థులతో వాగ్వాదానికి దిగారు. యాభై లేదా వంద ఓట్ల తేడాతో ఓడిపోతే ఏమైనా అనుకోవచ్చు కానీ ఇంత డబ్బు పంచినా భారీ తేడాతోర ఓడిపోయామం టూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గ్రామస్థులు సైతం మీ ఇంటికి ఏమైనా డబ్బులు ఇవ్వమని వచ్చామా అంటూ బాలరాజు దంపతులను నిలదీశారు.