16-08-2025 12:00:00 AM
మంచిర్యాల, ఆగస్టు 15 (విజయక్రాంతి): జిల్లా రైతాంగాన్ని ఎరువుల కొరత పట్టి పీడిస్తుంది. జిల్లా అధికారులకు రికార్డులలో ఎరు వులు సంవృద్దిగా ఉన్నట్లు కాగితాల్లో లెక్కలు చూపుతున్న కింది స్థాయి అధికారులు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించకపోవడంతో రైతులు గోస పడుతున్నారు. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులతో యూరియా కొరత బాగా ఉండటంతో రైతన్నలు సొసైటీలకు వస్తున్న ఎరువుల (ఆదార్ కార్డు, పాస్ బుక్కుకు ఒక బస్తా) కోసం పొద్దున నుంచే వరుసలో నిలబడుతున్నారు.
జిల్లా దాటిస్తూ.. కొరత సృష్టిస్తూ...?
జిల్లాలోని హోల్ సేల్ వ్యాపారులు ఎరువుల ధరలు పెంచి బ్లాక్‌లో అమ్మేందుకే కృ త్రిమ కొరత సృష్టిస్తున్నారు. ప్రతి రోజు ఏదో ఒక విధంగా జిల్లాలోని ఎరువులు పక్క జిల్లాలకు, రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఇదంతా ఆ యా మండలాల, డివిజన్ స్థాయి అధికారుల కనుసన్నులలో ‘మామూలు’ తతంగంలా జ రుగుతుండటంతో వ్యాపారులకు కలిసి వ స్తోంది. పదుల వాహనాల్లో తరలిస్తుంటే ఒక టో, రెండు వాహనాలను పట్టుకొని చేతులు దులుపుకుంటున్నారు.
జిల్లాలోని 18 మండలాల్లో పీఏసీఎస్, డీసీఎంఎస్, హాకా, రైతు సంఘాలు, ప్రైవేటు దుకాణాలు కలిపి 344 ఉండగా ఇందులో మహారాష్ర్ట సమీప చెన్నూ రు మండలంలోనే 50, కోటపల్లి మండలం లో 20 దుకాణాలున్నాయి. వందల మెట్రిక్ టన్నుల ఎరువులు వస్తున్నా రైతులకు ఎందు కు చేరడం లేదో అధికారులు దృష్టి పెడితే ఇట్టే దొరుకుతుందని రైతులు వాపోతున్నారు. తెలంగాణ ఎరువులను కొందరు అధిక ధరలకు మహారాష్ర్టకు తరలిస్తుండటంతో ఒక్కొక్క బస్తా తీసుకునేందుకు రైతులు చెప్పులు వరుసలో పెట్టడం తప్పడం లేదు.
అధికారుల సహకారంతోనేనా..!
వ్యవసాయాధికారుల సహకారంతోనే పక్క రాష్ట్రాలకు పెద్ద ఎత్తున యూరియా తరలుతుంది. మంచిర్యాల నుంచి వచ్చిన ఒక లారీ లోడ్ ఎరువులను చెన్నూర్ మండలం లో చిన్న చిన్న వాహనాల్లో నింపి అన్నారం ప్రాజెక్టు మీదుగా మహారాష్ర్టకు తరలించినట్లు సమాచారం. మరోవైపు సుందరశాల సొసైటీకి కేటాయించిన యూరియాను సంబంధిత శాఖ అధికారుల సహకారంతో రైతులకు ఇవ్వకుండా అదే గ్రామంలోని ఫర్టిలైజర్స్ షాపులకు పంపించి అధిక ధరలకు విక్రయించినట్లు తెలిసింది. ఇలాంటి వాటికి అధికారులే సహకరిస్తుండటంతో రైతులు యూరియా కోసం ఇబ్బందులు ఎదుర్కొరా..! అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
యూరియా కోసం తిప్పలు పడుతున్నం
చెన్నూర్ లో 30 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నా. పదేండ్లుగా వ్యవసాయం చేస్తున్నా కానీ ఎప్పుడు ఇంత కొరత ఏర్పడలేదు. సొసైటీల్లో ఒక బస్తా రూ. 265కి పాసు బుక్కుకు ఒక్కటే ఇస్తుంటే గ్రోమోర్ లో రూ. 300 పెట్టి తీసుకున్న. ప్రైవేటులనైతే బస్తా రూ. 350 పెట్టి తెచ్చుకున్న. కొందరు దళారులు సొసైటీల నుంచి రైతుల ఆథార్ కార్డులు పెట్టి పెద్ద మొత్తంలో బస్తాలు జమ చేస్తు భయటకు పంపుతుంటే మాకు ఎరువులు దొరకడం లేదు. తప్పని పరిస్థితుల్లో అధిక డబ్బులు చెల్లించి తీసుకుంటున్నం.
పెద్దింటి ప్రవీణ్,
కౌలు రైతు, చెన్నూర్