13-12-2025 12:00:00 AM
లక్షెట్టిపేట టౌన్, డిసెంబర్ 12 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తుందని, ఉచితంగానే మందులు అందిస్తుందని, ఈ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని న్యాయవాదులు నలిని కాంత్, రెహమతుల్లాలు పేర్కొన్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా శుక్రవారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు ప్రభు త్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరై వారు మాట్లాడారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత మందు లు, గర్భిణీలకు ఉచిత ఆపరేషన్లు, ఉచి త వైద్యం అనేక రకాల సేవలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు శ్రీనివాస్, సురేష్, న్యాయవాదులు చాతరాజు శివ, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.