calender_icon.png 14 December, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన ఆసుపత్రి పనుల తనిఖీ

13-12-2025 12:00:00 AM

చెన్నూర్, డిసెంబర్ 12 : చెన్నూర్ లో నిర్మాణమవుతున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ ప్రజలకు మరింత చేరువలో మెరుగైన వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని చేప ట్టిందని తెలిపారు. వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రజలకు వైద్య సేవలను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని,  గుత్తేదారుల సమన్వయంతో పనులను వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపా రు. అనంతరం ప్రభుత్వ గిరిజన సంక్షే మ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాలలో చేపట్టిన మరమ్మత్తు పనులను, పట్టణ పీహచ్‌సీ నిర్మాణ పనులను, అమృత్ 2.0 నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయా లని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆయా శాఖల అధికారులు ఉన్నారు.