13-12-2025 12:00:00 AM
ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అన్ని రంగాల్లో రాణించేందుకు ఆధునిక వసతులు
ఏఐ ల్యాబ్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి) : ప్రత్యేక అవసరాలు గల పిల్లల నైపుణ్యాభివృద్ధికి కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత బోధన ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శుక్రవారం డైట్ కళాశాల ఆవరణలోని భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల అభ్యాసన సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి రూపొందించిన ఆధునిక యంత్రాలు, మౌలిక వసతులతో కూడిన ఏఐ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఏఐ ల్యాబ్ ప్రారంభంతో పిల్లల కమ్యూనికేషన్, అభ్యాస నైపు ణ్యాలు మరింత మెరుగుపడతాయని విశ్వా సం వ్యక్తం చేశారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అన్ని రంగాల్లో రాణించేందుకు ఆధునిక సాంకేతిక వసతులు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. భవిత కేంద్రంలో ఏర్పాటు చేసిన ట్రెస్టిల్, కోబో టాబ్లెట్, డిజిటల్ స్పీచ్ ట్రైనర్, గ్రూప్ హెయరింగ్ కిట్స్, ఏఏసీ కిట్స్, డిజిటల్ స్పీచ్ థెరపీ పరికరాలు, సహాయక సాఫ్ట్వేర్ ద్వారా పిల్లల్లో అభ్యాస, కమ్యూనికేషన్ సామర్థ్యాలు పెంపొందుతాయని తెలిపారు.
ఉన్నత విద్య కోసం ఉట్నూర్లోని వికాసం పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామని, రెసిడెన్షియల్ పాఠశాల నిర్మా ణానికి నిధుల సమీకరణతో పాటు బోధన సిబ్బంది నియామకానికి ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. పెన్షన్, ఇతర సమస్య లు ఉంటే తెలియజేయాలని, వాటి పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రతి గర్భిణీ తప్పనిసరిగా టిఫా స్కానింగ్ చేయించుకోవాలని, వైద్య ఆరోగ్యశాఖ ద్వా రా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్, నీతి అయోగ్ ప్రోగ్రామ్ అధికారి రాహుల్, కోఆర్డినేటర్ తిరుపతి, రిసోర్స్ పర్సన్లు, పిల్లల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.