calender_icon.png 5 July, 2025 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్యాగానికి నిదర్శనం మొహరం పండుగ

05-07-2025 05:26:44 PM

మొహరం పండుగ-పీరీల పండుగ ఇది త్యాగాల ప్రతీక..

తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ సర్వర్ అహ్మద్..

ములుగు/వెంకటపూర్ (విజయక్రాంతి): మొహరం పండుగ అనేది మానవ హక్కుల పరిరక్షణ కోసం 14వ శతాబ్దాల క్రితమే జరిగిన చారిత్రాత్మక పోరాటమే మొహరం, కర్బలా మైదానంలో జరిగిన యుద్ధంలో ఇస్లామిక్ మత పరిరక్షణ కోసం జరిగిన యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనుమలు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ ఇమామి హసేన్ లు ఈ మాసంలోని పదవ రోజున వీర మరణం పొందిన వారి జ్ఞాపకార్థం శోక సంతాప దినాలుగా ఆచరిస్తారు. అప్పటి రాజు అమీర్ మౌలానా కుమారుడు యాజిద్ కు వారసత్వంగా రాజ్యాధికారాన్ని అప్పజెప్పడాన్ని ప్రవక్త మనవలు హుస్సేన్, హసేన్ లు వ్యతిరేకించారు. దీంతో యాజిద్ సైన్యం వీరిద్దరిని హతమార్చేందుకు పన్నాగం పన్నింది.

తుదకు వీరు నమాజు చేస్తున్న వీళ్ళిద్దరిపై దాడి చేయడంతో ఇద్దరితో పాటు ఆ యుద్ధంలో రక్తసంబంధీకులు కూడా చాలామంది చనిపోయారు. వెదురు బొంగులకు తలలను పెట్టి అపహాస్యం చేస్తూ ఊరేగించారని చెబుతారు. అందుకే ప్రతి సంవత్సరం వీరీ త్యాగాన్ని స్మరిస్తూ మొహరంను జరుపుకోవడం మొదలు పెడతారు. వీరిలమ్మలను కొట్టంలోని పెట్టెలో దాచి ఉంచిన పీరీలను నెలవంక వచ్చిన రోజు తీసి శుభ్రం చేసి వెదురు బొంగులకు అమర్చి అలంకరిస్తారు. ఇవి అలంకరించేందుకు రెండు రోజులు పడుతుంది ఆ తర్వాత ఆశిర్ఖానాలను మస్జిదులను శుభ్రం చేసి పీరీలను నిలబెడతారు. పీరీల ఊరేగింపు మొహరం వేడుకల్ని హిందూ ముస్లింలు సోదర భావంతో కలిసిమెలిసి జరుపుకుంటారు.

పీరీల ఊరేగింపు సందర్భంగా తొమ్మిది రోజులు గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. పీరీలను ప్రతిష్టించి మొదటి ఐదు రోజులు మసీదులు, కొట్టాలలోనే ఉంచగా ముజావర్లు ప్రతిరోజు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆరవ రోజు నుంచి తొమ్మిదవ రోజు వరకు పీరీలను గ్రామాల్లో ఇంటింటికి మొక్కుల కోసం తిప్పుతుంటారు. తొమ్మిదవ రోజు ఉదయం పెద్ద ఎత్తున పాలతో మటీకిలను తయారు చేసి అగ్నిగుండం వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే కొంతమంది భక్తులు మసీదుల వద్ద కందూరు కూడా నిర్వహిస్తారు. అలావా (గుంత) ఏర్పాటు చేసి కట్టెలతో నిప్పు తయారుచేస్తారు. ప్రతిరోజు నిప్పు గుండం(అగ్నిగుండం) చుట్టూ తిరుగుతూ అసేయ్ దూల హారతి అంటూ ఆడుతారు. పీరీలను రోజు ఉదయం, సాయంత్రం గ్రామ వీధుల్లో ఊరేగించి భక్తులు ఇచ్చే కానుకలు స్వీకరిస్తారు. పదో రోజు అర్ధరాత్రి వరకు ఊరేగించి పీరీలను నీటిలో నిమజ్జనం చేస్తారు.