07-07-2025 12:56:10 AM
- కేంద్రానికి లేఖ రాసిన సుప్రీం కోర్టు
- గడువు ముగిసినా బంగ్లా ఖాళీ చేయని జస్టిస్ చంద్రచూడ్
- కూతుర్ల ఆరోగ్య పరిస్థితి వల్లే ఆలస్యమయింది: జస్టిస్ చంద్రచూడ్
న్యూఢిల్లీ, జూలై 6: సర్వోన్నత న్యాయమూర్తిగా పదవీకాలం ముగిసిన తర్వాత కూడా భారత మాజీ ప్రధాన న్యాయమూ ర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తనకు కేటాయించిన అధికారిక నివాసాన్ని వీడట్లేదు. దీంతో సుప్రీం కోర్టు యంత్రాంగం ఆ బం గ్లాను స్వాధీనం చేసుకోవాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
ఢిల్లీలోని కృష్ణా మీనన్ మార్గ్‌లో ఉన్న ఐదవ నంబర్ బంగ్లాను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి కేటాయించడం ఆనవాయితీ. అదే విధంగా మాజీ సీజేఐ చంద్రచూడ్‌కు కూ డా కేటాయించారు. అయితే చంద్రచూడ్ పదవీవిరమణ తర్వాత కూడా ఆ నివాసాన్ని ఖాళీ చేయకపోవడం గమనార్హం.
2024 నవంబర్‌లో పదవీవిరమణ చేసిన చంద్రచూడ్‌కు పదవీవిరమణ తర్వాత బంగ్లాను ఖాళీ చేసేందుకు ఇచ్చిన ఆరు నెలల గడువు కూడా మే 10తో ముగిసిం ది. ప్రత్యేక అనుమతితో గడు వు ను మే 31 వరకు పొడిగించినా కానీ చం ద్రచూడ్ బంగ్లా ఖాళీ చేయలేదు.
ఆయన తర్వాత ఓ న్యాయమూర్తి చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించి.. పదవీవిరమణ కూడా చేశారు. అయి నా కానీ చంద్రచూడ్ ఇప్పటికీ ఖాళీ చేయకపోవడంతో సుప్రీం కోర్టు యంత్రాంగం జూలై 1న కేంద్ర గృ హ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. జస్టిస్ చంద్రచూడ్ నుంచి బంగ్లాను తక్షణమే స్వా ధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కో రింది. ఆయనకు ఇచ్చిన అనుమతి గ డవు కూడా ముగిసిందని పేర్కొంది.
వ్యక్తిగత కారణాల వల్లే ఆలస్యమైంది..
ఈ వివాదంపై జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు. తప్పనిసరి వ్యక్తిగత కారణాల వల్లే ఆలస్యం అయిందని, ఈ విషయం సుప్రీం కోర్టు యం త్రాంగానికి కూడా తెలుసని పేర్కొన్నారు. ‘నాకు ప్రత్యేక అవసరాలున్న ఇద్దరు కుమార్తెలున్నారు. వారి ఆ రోగ్య పరిస్థితి కారణంగా వారికి అ నువైన ఇల్లు చూసేందుకు కొంత స మయం పట్టింది.’ అని పేర్కొన్నారు.