calender_icon.png 24 May, 2025 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యుత్తమ ర్యాంకులను సాధించిన వాగ్దేవి

12-05-2025 02:26:37 AM

విద్యార్థులను అభినందించిన వాగ్దేవి కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్‌రెడ్డి 

మహబూబ్ నగర్ మే 11 (విజయ క్రాంతి) : రాష్ట్ర స్థాయి ర్యాంకులతో వాగ్దేవి విజయకేతనం ఎగరవేసింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులలో ప్రవేశాల కోసం ఆన్లైన్లో నిర్వహించిన ఎఫ్సెట్ ఫలితాలలో జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులతో అత్యుత్తమ ఫలితాలను సాధించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ విజేత వెంకట్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లా డుతూ సాయి దీపిక స్టేట్ 741 వ ర్యాంక్, జువేరియా, స్టేట్1279, రబ్షా స్టేట్ 2191, తబ్రీజ్ స్టేట్ 3483, శ్రీహరి స్టేట్ 5223, నూరిన్ స్టేట్ 5486, రాజేశ్వరి స్టేట్ 5627, ప్రియాంక స్టేట్ 7052, వైష్ణవి స్టేట్7162,సీమ స్టేట్ 8353, నవనీత్ కుమార్ గౌడ్ స్టేట్ 8391,పవన్ కళ్యాణ్ స్టేట్ 8613, అనుష్క స్టేట్ 8638, అబేదా స్టేట్ 8684, మౌనిక స్టేట్ 8730, జ్ఞానేశ్వర్ స్టేట్ 9468, యమునా స్టేట్ 9573 ర్యాంకులను సాధించినట్లు తెలిపారు.

వీరితోపాటు 15 వేల ర్యాంకులోపు 22 మంది విద్యార్థులు 20వేల ర్యాంకులోపు 29 మంది విద్యార్థులు సాధించారని పేర్కొన్నారు. సాధించాలనే సంకల్పం విద్యార్థులైతే సాధింప చేసే సమర్థత మాది అంటూ అధ్యాపకులు అందరూ ఎంతో కష్టపడి నాణ్యమైన విద్యను అందించి ఇంతటి ఘన విజయాన్ని సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని అధ్యాపకులను విద్యార్థులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గీతాదేవి ఐఐటి నీట్ అకాడమీ ఇంచార్జ్ పావని రెడ్డి ఎంసెట్ ఇంచార్జ్ షాకీర్ యాజమాన్య సభ్యులు , కోట్ల శివకుమార్, రాఘవేంద్రరావు, నాగేందర్, అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.