calender_icon.png 5 November, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుంగతుర్తిలో ప్రధాన రహదారి గుంతల మయంతో కష్టాలు

04-11-2025 07:53:49 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రం నుంచి సూర్యపేటకు వెళ్ళే ప్రధాన రహదారి కల్వర్టు పూర్తిగా ధ్వంసం అయ్యి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఈ రహదారి నిర్మాణం చేపట్టాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబు అన్నారు. ఇద్దరు శాసన సభ్యులు శంకుస్థాపన చేసి రెండు సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ ఈ రహదారి నిర్మాణం జరగక పోవడం బాధాకరమన్నారు. తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అవుతుంది అని అన్నారు. ఈ రహదారి నిర్మాణం లో మొదట కేవలం మోరీలు వేసి వదిలేశారు అని అన్నారు. అతి త్వరలో ఈ రహదారి నిర్మాణం చేపట్టకపోతే భారతీయ జనతా పార్టీ తరపున పాద యాత్ర చేస్తామని అన్నారు.