29-11-2025 01:29:14 AM
బిజెపి జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజగోపాల్ గౌడ్
రాజేంద్రనగర్, నవంబర్ 28 (విజయక్రాంతి): నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన గొప్ప ధైర్యశాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బిజెపి రంగారెడ్డి (అర్బన్) జిల్లా అధ్యక్షులు పంతంగి రాజగోపాల్ గౌడ్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా హైదర్గూడా చౌరస్తాలోని పటేల్ విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చిన తరువాత నిజాం పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పించడం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో గ్రూప్ చేశారని గుర్తు చేశారు. నాడు 650 సంస్థానాలను వీరియం చేసిన గొప్ప నాయకుడు అన్నారు. సర్దార్ పటేల్ కు ఉక్కుమనిషి అనే బిరుదు కలదు అన్నారు. పటేల్ ఆశయాలకు అనుగుణంగా నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
రంగారెడ్డి జిల్లా కన్వీనర్ మల్లారెడ్డి గారు మాట్లాడుతూ దేశానికి దశా దిశా చూపించే ఐపిఎస్ అధికారులు మన ప్రాంతం శివరాంపల్లిలోనే ట్రైనింగ్ పొందుతున్నారని ఈ ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ కే దక్కుతుందని కొనియాడారు. ఈ హైదర్గూడా చౌరస్తా నుంచి ఈశ్వర్ థియేటర్ పిల్ల నెంబర్ 136 వరకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలు పట్టుకొని మిలియన్ మార్చ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య కాలేజ్ విద్యార్థులు, ఉషోదయ స్కూల్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు, యువతి, యువకులు నాయకులు టి. అంజన్ కుమార్ వైస్.శ్రీధర్ ఎం. కొమురయ్య పి. మల్లేష్ యాదవ్, కాడం సుధాకర్, సాబాద విజయకుమార్, గొరిగె రాజు, ఎస్ వెంకటేష్ పి. సందీప్, జయ ఆనంద్ రెడ్డి, యం.నగేష్, బిక్షపతి యాదవ్ కాకులారం కృష్ణ,, కిరణ్ చారి, ఎస్ మణికంఠ, విజయ భాస్కర్ రెడ్డి, పిఎస్ మల్లారెడ్డి, ఎస్. లక్ష్మీనారాయణ రెడ్డి, కె.రవీందర్ రెడ్డి, రామ్ చందర్ రావు, శ్రీశైలం పాల్గొన్నారు.