calender_icon.png 3 August, 2025 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిటీ లైబ్రరీలో విలువైన పుస్తకాలు

31-07-2025 01:33:24 AM

  1. పాఠకులకు అందుబాటులో ఉంచాలి
  2. హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 30 (విజయక్రాంతి): హైదరాబాద్ జిల్లాలోని గ్రంథాలయాల్లో విలువైన పుస్తకాలను పాఠకులకు అందుబాటులో ఉంచాలని, లైబ్రరీ వలంటీర్లను నియమించాలని కలెక్టర్ హరిచందన దాసరి అధికారులను ఆదేశించారు. బుధవారం చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీని ఆమె సందర్శించారు. రీడర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందున లైబ్రరీ వలంటీర్లను ఏర్పాటు చేసి, వారికి ఐడీ కార్డులు అందజేయాలని సూచించారు.

గ్రంథాలయాలు విద్యతో పాటు వ్యక్తిగత, సామాజిక అభివృద్ధికి కీలకమని ఆమె నొక్కి చెప్పారు. లైబ్రరీలో నిరంతరం విద్యుత్, త్రాగునీరు, వెలుతురు ఉండేలా చూడాలని సూచించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఈసెట్, నీట్ వంటి కోర్సులకు సంబంధించిన విలువైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కదిరవన్ పలని, గ్రంథాలయ కార్యదర్శి పద్మజ, తహసీల్దార్ రాణా ప్రతాప్ సింగ్, లైబ్రేరియన్ మహేందర్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

యూపీహెసీల నిర్మాణానికి స్థలాల గుర్తింపు

హైదరాబాద్ జిల్లా పరిధిలో గుర్తించిన వివిధ ప్రాంతాల్లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల యూపీహెసీలు నిర్మాణానికి స్థలాల గుర్తింపు, టెండర్ల ప్రక్రియను సత్వరమే చేపట్టాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా వైద్యాధికారులు, జీహెఎంసీ ఇంజినీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కంటోన్మెంట్ డిప్యూటీ సీఈఓ పల్లవితో కలిసి ఆమె పాల్గొన్నారు.

తహసీల్దార్లు, జీహెఎంసీ ఇంజినీరిం గ్ అధికారులు కలిసి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మా ణం కోసం అనువైన స్థలాలను గుర్తించి, వారం రోజుల్లోపు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. జీహెఎంసీ పరిధిలో గుర్తించిన 14 యూపీహెసీలకు 200 గజాలకు పైగా స్థలం ఉండాలని ఆమె సూచించారు.