calender_icon.png 4 August, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్తులు కాదు ఆరోగ్యం ఇవ్వాలి

31-07-2025 01:33:18 AM

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, జూలై 30: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధికి, సుందరీకరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అధికారులను ఆదేశించారు. బుధవారం మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనులపై ఎమ్మెల్యే గాంధీ కార్పొరేట ర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్,ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చందానగర్ డివిజన్ పరిధిలోని బక్షి కుంట,రేగులకుంట, పటేల్ చెరువు ,గంగారాం పెద్ద చెరువుల సుందరికరణలో భాగంగా న్యాయ చిక్కులు, కోర్ట్ పరిధిలో ఉండడంతో సుందరీకరణ పనులకు ఆటంకం ఏర్పడిందని, దీంతో పనులలో జాప్యం నెలకొందని, త్వరితగతిన న్యాయ వివాదాలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని,టీడీఆర్ వంటి అంశాలు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూసి చెరువుల అభివృద్ధి పనులు త్వరితగతిన ప్రారంభించాలని అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశిం చారు.

చెరువుల చుట్టూ స్థలాల యజమానులతో చర్చించి ఎటువంటి ఆటంకం లేకుం డా పనులను పూర్తి స్థాయిలో చేపట్టాలని అన్నారు. యజమానులు కూడా సహకరించి చెరువుల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. చెరువులలో కలుషిత నీరు కలువకుండా చర్యలు చేపట్టాలని,చెరువు కట్టల బలోపేతం, చెరువుల పైన గ్రీన్ కవర్ పెంచడం వంటి చర్యలు చేపట్టాలని అన్నా రు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు ఎస్ ఈ శ్రీనివాస్ ,ఈఈ నారాయణ, డీఈ నళిని, ఏఈ లక్ష్మీ నారాయణ, ఏఈ శ్రీనివాస్, ఏఈ శశాంక్ పాల్గొన్నారు.