01-07-2025 06:36:04 PM
పాల్గొన్న దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి, అర్చకులు, ఉద్యోగులు...
భద్రాచలం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్(Endowment Commissioner)గా ఉత్తర్వులు మేరకు మంగళవారం భద్రాచలం రామాలయం ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమం దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి ఆధ్వర్యంలో ఉద్యోగులు అర్చకులు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా రామాలయం ఆవరణలో పెద్ద ఎత్తున చెట్లు, పూల మొక్కలు పండ్ల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఈఓ.రమాదేవి ఏఈఓలు, భవాని రామకృష్ణ, శ్రావణ్ కుమార్, ఈఈ రవీంద్రనాథ్, సీసీ శ్రీనివాస్ రెడ్డి, సూపర్డెంట్ కత్తి శ్రీనివాసరావు, అర్చకులు గోపి స్వరూప్ తో పాటు వేద పండితులు, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.