26-09-2025 07:28:37 PM
భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని ఈనెల 28న భద్రాచలంలో తలపెట్టిన ఆదివాసీల ధర్మయుద్ధం సభను ఆదివాసిలందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆదివాసి ఐకాస రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర పిలుపునిచ్చారు. శుక్రవారం పాల్వంచ కొమురం భీమ్ భవన్ నందు సభకు సంబంధించిన గోడ పత్రికలను ఆదివాసి సంఘాల జెఎసి సీనియర్ నేతలు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు పేర్కొంటూ, ఎస్టీ రిజర్వేషన్ లన్ని లంబాడీలే కొల్లగొడుతున్నారని, చట్టబద్దత లేని లంబాడీలను తొలగించే మలి దశ పోరాటంలో ఆదివాసి ప్రజానీకం పెద్దఎత్తున ధర్మయుద్ధ సభకు వేలాదిగా కదలి రావాలన్నారు.