calender_icon.png 24 January, 2026 | 7:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొండికుంట గ్రామ వ్యాపారస్తులతో పంచాయితీ పాలకవర్గ సమావేశం

24-01-2026 06:21:39 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): మొండికుంట గ్రామ పంచాయితీ పరిధిలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న వ్యాపారస్తులతో గ్రామ పంచాయితీ పాలకవర్గ సమావేశం శనివారం గ్రామ పంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ మర్రి సంధ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన రహదారి మధ్య నుంచి 40 అడుగుల లోపలే అన్ని రకాల దుకాణాలు, హోటళ్లు, మాంసపు దుకాణాలు, మెకానిక్ షాపులు ఏర్పాటు చేసుకోవాలని తీర్మానించారు. దుకాణాల బోర్డులు కూడా ఇదే కొలతలో ఉండాలని స్పష్టం చేశారు.

ఫిబ్రవరి 1 లోపు దుకాణాలను సర్దుబాటు చేసుకోవాలని, లేకపోతే నోటీసులు జారీ చేసి జరిమానా విధిస్తామని తెలిపారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. రహదారి వెంబడి పాదచారులకు ఇబ్బందులు లేకుండా చూడడమే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చెల్లమల్ల శివ, వార్డు సభ్యులు, పంచాయితీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, పంచాయితీ సిబ్బంది, వ్యాపారస్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.