14-10-2025 01:23:52 AM
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 13: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల తహసీల్దార్ కార్యాలయానికి శిక్షణలో భాగంగా ఎనిమిది వారాల పాటు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఎస్.వీణ ను కార్యాలయంలో విధులు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఎస్.వీణ సోమవారం బాధ్యతలు చేపట్టారు.