29-12-2025 07:24:43 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా వీరగోని శ్రీనివాస్ గౌడ్,అధ్యక్షలుగా మాదాసురామేశ్వరరావు, ప్రదాన కార్యదర్శిగా కుందేళ్ల శ్రీనివాస్, ట్రెజరర్ గా మడుపు శ్రీనివాస్,ఉపాధ్యక్షులుగా గోసికొండ రాజు, గౌరవ సలహాదారుగా కన్న కొమరయ్య గౌడ్ తోపాటు కార్యవర్గ సభ్యులను సోమవారం ఎన్నుకున్నారు.
ఈ సమావేశంలో 304 డిస్ట్రిక్ట్ కరీంనగర్ వాకర్స్ ఇంటర్నేషనల్ పీఆర్ఓ బుర్ర జగదీశ్వర్ గౌడ్, డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ అన్నేడి వెంకట్ రెడ్డి, చైర్పర్సన్ కేసీ మూర్తిలు ఎన్నుకున్నా కార్యవర్గంకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. జనవరి 4న నూతనoగా ఏర్పడిన 304 డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్నమనేని సుధాకర్ రావు, కేబినెట్ ఇన్స్టలేషన్ ప్రోగ్రాం కరీంనగర్ అలుగునూర్ ఏఎంఆర్ ఉన్నతి ఫంక్షన్ హాల్ లో జరిగే ప్రమాణ స్వీకారోత్స సమావేశం విజయవంతం చేయాలని కరపత్రాలు ప్రదర్శoచినా కాన్ఫరెన్స్ చైర్మన్ బుర్ర జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు.