calender_icon.png 29 December, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దైవ యాత్రలే ముక్తిఫలానికి సత్ప్రవర్తనకు రాజ మార్గాలు

29-12-2025 07:39:41 PM

డిఎస్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల వెంకటేశ్వర్లు

జవహర్ నగర్,(విజయక్రాంతి): దైవ యాత్రలే భక్తికి, ముక్తి ఫలానికి, సత్ప్రవర్తనకు రాజ మార్గాలని, ప్రతి ఒక్కరూ దైవభక్తిని కలిగి ఉండాలని తద్వారా సమాజంలో మంచి మార్గాలతో ప్రేమతో ఇతరుల మన్నన పొందుతారని డిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎర్ర గుడ్ల వెంకటేశ్వర్లు తెలిపారు. జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ స్వామి తన శబరిమల యాత్ర సందర్భంగా డిఎస్ఎస్ అధ్యక్షుడు ఎర్ర గుడ్ల వెంకటేశ్వర్లు తదితరులు సోమవారం శ్రీకాంత్ స్వామి శబరిమల దైవ యాత్ర సందర్భంగా వీడ్కోలు పలికి శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... అయ్యప్ప స్వామి ఆశీస్సులతో మణికంఠుని కరుణాకటాక్షాలతో దీవెనలతో శ్రీకాంత్ దైవ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని తద్వారా యాత్ర ఫలాలు జవహర్ నగర్ ప్రజలందరికీ దక్కేలా అయ్యప్ప ఆశీస్సులు ఇవ్వాలని కోరుకున్నారు. మణికంఠుని దివ్య ఆశీస్సులు, శబరీ గిరీసునీ దివ్య మహిమలతో యాత్ర దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప, ఎరుమేలి వాసుడు మహిమగల మణికంఠ స్వామి శబరి యాత్ర సర్వ శుభాలకు నిలయమని, పందల వాసుని కరుణాకటాక్షాలతో జవహర్ నగర్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ మణికంఠుని కోరుకున్నట్టు తెలిపారు. అనంతరం శ్రీకాంత్ స్వామికి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.