08-11-2025 12:30:40 AM
నిందితుడు బస్సు ప్రమాద కేసులో ‘ఏ2’
అమరావతి, నవంబర్ 7: బస్సు ప్రమాదం కేసులో ఏ2 నిందిదుడైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్‌ను శుక్రవారం కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం విచారణ చేపట్టి, అనంతరం రూ.10 వేల సొంత పూచీకత్తుపై ఆయన్ను విడుదల చేసింది. కర్నూలు జిల్లాలో గత నెల 24న వేమూరి ట్రావెల్స్‌కు సంబంధించిన బస్సులో అగ్నిప్రమాదం సంభవించి, 19 మంది ప్రయాణికులు మృతి చెందిన విషయం తెలిసిందే.
రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను బస్సు ఢీకొట్టి, దానిని ఈడ్చుకుంటూ వెళ్లడంతో బస్సులో మంటలు చెలరేగాయని విచారణలో పోలీసులు తేల్చారు. ట్రావెల్స్ యాజమాన్యం సీటర్ వాహనాన్ని స్లీపర్‌గా మార్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో బస్సు డ్రైవర్, యజమానిపై కేసు నమోదైంది. పోలీసులు ఏ-1 నిందితుడైన డ్రైవర్ లక్ష్మయ్యను అరెస్టు చేశారు.