08-11-2025 12:26:00 AM
న్యూఢిల్లీ, నవంబర్ 7: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) సిస్టంలో సాంకేతిక లోపం కారణంగా శుక్రవారం విమాన కార్యకలాపాలు అస్తవ్యస్తంగా మా రాయి. సాంకేతిక లోపం కీలకమైన డేటా సిస్టమ్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు విమాన ప్రణాళికలను మాన్యువల్‌గా ప్రాసెస్ చేయవలసి వచ్చింది.
దీని కారణంగా 800లకు పైగా విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో వందలాది మంది ప్రయాణికులు టెర్మినల్స్‌లో చిక్కుకుపోయారు. గురువారం అర్ధరాత్రి ప్రారంభమైన ఈ అంతరాయం, కంట్రోలర్ల కోసం విమాన ప్రణాళికలను రూపొందించే ఆటో ట్రాక్ సిస్టమ్ (ఏటీఎస్)కు డేటాను అందించే కీలకమైన కమ్యూనికేషన్ నెట్‌వర్క్ అయిన ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్(ఏఎంఎస్‌ఎస్) పై ప్రభావం చూపిందని అధికార వర్గాలు గుర్తించాయి. సమస్యను పరిష్కరించేందుకు సాంకేతిక సిబ్బంది ప్రయత్నిస్తు న్నాయని అధికారులు తెలిపారు.