31-01-2026 12:00:00 AM
కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్
సికింద్రాబాద్ జనవరి 30 (విజయక్రాంతి): స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వీరులను గౌరవించుకోవటం, వారి సేవలు చిరస్మరణీయమని ఓల్ బోయిన్ పల్లి 119 డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు.ఓల్ బోయిన్ పల్లి 119 డివిజన్ పరిధిలో హెచ్‌ఏఎల్ పార్కు వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ హాజరై మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధుల త్యాగాన్ని స్మరించుకుంటూ నివాళ్ళర్పిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మాట్లా డుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో సమరయోధుల త్యాగాల ఫలితంగా మనం ఈనాడు స్వేచ్చా వాయువులు పీలుస్తున్నామని,వారి జ్ఞాపకార్థంగా జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి రోజున అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు.