16-12-2024 01:09:29 AM
తాడ్వాయి, డిసెంబర్ 15: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమంలో ఆదివారం దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆశ్రమం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై వేంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అంతకు ముందు ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. రాత్రి సమయంలో రథోత్సవం నిర్వహించారు.