16-12-2024 01:08:04 AM
రాజేంద్రనగర్, డిసెంబర్15 (విజయక్రాంతి): రాజేంద్రనగర్ డివిజన్ అత్తాపూర్‌లోని హైదర్ గూడలో ఉన్న నెక్ట్స్ జెన్‌కార్ కారు సర్వీసింగ్ సెంటర్‌లో ఆదివారం అగ్నిప్రమాదం జరి గింది. ప్రమాదంలో నాలుగు కార్లకు మంటలు అంటుకోగా, ఓ కారు పూర్తిగా దగ్ధమైంది.
స్థానికులు అప్రమత్తమై మంటలు వ్యాప్తిచెందకుండా ఆర్పేశారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకనొ మంటలను పూర్తిగా అదుపు చేశారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.