calender_icon.png 1 February, 2026 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సమ్మక్క, సారక్క వన దేవతల జాతర

31-01-2026 12:00:00 AM

బెజ్జంకి, జనవరి 30: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి,తోటపల్లి, వడ్లూరు ,గ్రామలలో గల సమ్మక్క- సారలమ్మ జాతర  వైభవంగా కొనసాగాయి. శుక్రవారం వన దేవతలను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. వడ్లూరు లో అమ్మవార్లను మాన కొండూరు ఎమ్మెల్యే  సత్యనారాయణ దర్శించుకున్నారు. వనదేవతలకు భక్తులు నిలువెత్తు  బం గారం సమర్పించి, అమ్మవార్లకు భక్తులు చీర, సారె సమర్పించి, ఒడిబియ్యం పోశారు.అమ్మవారికి ఎదురు కోడ్లను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కల గకుండా జాతర కమిటీ సభ్యులు అన్ని ఏర్పాటు చేశారు. ఈ జాతరలో  ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజ ప్రతినిధులు అధికారులు, ప్రజాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.