calender_icon.png 31 January, 2026 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హస్తం పార్టీకి ఎదురుదెబ్బ

31-01-2026 12:00:00 AM

మెదక్‌లో కాంగ్రెస్కు బిగ్ షాక్..

బీఆర్‌ఎస్ గూటికి సీనియర్ నేత సుప్రభాత్ రావు

కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి హరీష్ రావు

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం: మాజీ మంత్రి హరీష్ రావు

ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై ఎగిరేది గులాబీ జెండానే

మెదక్, జనవరి 30 (విజయ క్రాంతి): మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మెద క్ నియోజకవర్గంలోని రామాయంపేటలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చౌదరి సుప్రభాత్ రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి, బీఆర్ ఎస్ లో చేరారు. శుక్రవారం హైదరాబాద్లోని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు నివాసంలో చేరిక కార్యక్రమం జరిగింది. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేంద ర్ రెడ్డి, మెదక్ సీనియర్ నాయకులు కంటా రెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో సుప్రభాత్ రావు తన అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్ లో చేరారు. వారికి హరీష్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లోనే కాదు, ఆ పార్టీ సొంత నాయకుల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొందని అన్నా రు. రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసింది శూన్యమని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక చేతులెత్తేశారని విమర్శించారు. అం దుకే అభివృద్ధిని కాంక్షించే కరుడుగట్టిన కాం గ్రెస్ వాది సుప్రభాత్ రావు లాంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్ ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. రామా యంపేటలో సుప్రభాత్ రావు చేరికతో పార్టీ మరింత బలోపేతం అయ్యిందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రామాయంపేటలో ఎగిరేది గులాబీ జెండానే అని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని హరీష్ రావు అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో జరగబోయే అన్ని మున్సిపాలిటీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయబోయేది, విజయ ఢంకా మోగించేది బీఆర్‌ఎస్ పార్టీనే అని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. అ నంతరం సుప్రభాత్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు, నాయకులకు సరైన గుర్తింపు లేదని, కేవలం గ్రూపు రాజకీయాలకే పరిమితమైందని సుప్రభాత్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.