13-05-2025 12:50:22 AM
7న ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో 2౦ మంది మావోయిస్టులు మృతి
చర్ల, మే 12: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లా కర్రెగుట్టలో ఈనెల 7న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది మావోయిస్టులు మృతిచెందారు. కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఏప్రిల్ ౨౨ నుంచి ౧౭ రోజులపాటు భద్రతాబలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగించాయి. ఈ క్రమంలోనే జరిగిన ఎన్‌కౌంటర్‌లో ౨౦ మంది మావోయిస్టు లు మృతిచెందారు.
మృతదేహాలను స్వాధీ నం చేసుకున్న భద్రతా బలగాలు బీజాపూ ర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాయి. 20 మంది మావోయిస్టుల మృతదేహాల్లో 11 మంది వివరాలు పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం, ఇతర చట్టపరమైన లాంఛనాలు పూర్తయిన తర్వాత సోమవారం ఆయా కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. మిగిలిన మావోయిస్టుల మృతదేహాల వివరాలు గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.
కాగా ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా మరుద్ బాకా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉసురులో కాంగ్రెస్ కార్యకర్త నాగ బండా రిని మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ నెపం తో దారుణంగా నరికి హత్య చేశారు. ఉసురు నుంచి తన స్వగ్రామమైన మరుద్‌బాకాకు వెళ్తున్న క్రమంలో తింగాపూర్ సమీపంలో మావోయిస్టులు పదునైన ఆయుధాలతో హతమార్చారు. నాగ బండారి సోదరుడు తిరుపతి కూడా 24 అక్టోబర్ 2024న ఇదే ప్రాంతంలో మావోయిస్టుల చేతుల్లో హత్యకు గురయ్యాడు.