calender_icon.png 26 January, 2026 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భిక్కనూరు సౌత్ క్యాంపస్ ను సందర్శించిన వైస్ ఛాన్సలర్

23-10-2024 05:27:47 PM

కామారెడ్డి, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూర్ సౌత్ క్యాంపస్ ను బుధవారం ఇటీవల బాధ్యతలు చేపట్టిన తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ యాదగిరిరావు సందర్శించారు. తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ లో అధ్యాపకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మెరుగైన విద్య బోధన అందించాలని వారికి సూచించారు. అనంతరం సౌత్ క్యాంపస్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ సుధాకర్ గౌడ్ పలు సమస్యలను వైస్ ఛాన్సలర్ యాదగిరి రావు దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.