calender_icon.png 26 January, 2026 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోగొట్టుకున్న ఫోన్లను అప్పగించిన పోలీసులు

23-10-2024 05:38:57 PM

సాంకేతిక పద్ధతుల ద్వారా గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగింత

దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లోనే ఇప్పటివరకు 120 ఫోన్లు రికవరీ

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రం పరిధిలోని దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫోన్లు పోగొట్టుకున్న వారు ఫిర్యాదు చేయగా దేవునిపల్లి ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో సిఈఐఆర్ యాప్ ద్వారా వెతికి వారికి బుధవారం దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్సై రాజు అప్పగించారు. ఫోన్ బాధితులు దేవునిపల్లి ఏటి సాయన్న, అట్లా మనోహర్, గోసంగి కాలనీకి చెందిన ఎల్లం, ఈల్చిపూర్ కు చెందిన వడ్డె నరేందర్, ప్రేమ్దాస్, అశోక్ నగర్ కు చెందిన రజాక్, మద్నూర్ కు చెందిన రమేష్ లకు ఫోన్లు అప్పగించడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. ఇప్పటివరకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో సిఈఐఆర్ యాప్ ద్వారా 120 పనులను రికవరీ చేసి యజమానులకు అప్పగించడం జరిగిందని ఎస్ఐ రాజు తెలిపారు.