03-09-2025 01:37:43 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని చాకపల్లి గ్రామంలో బుధవారం అనారోగ్య కారణంతో వికలాంగుడు ఇప్ప నరేష్ మృతి చెందారు. మృతుని దహన సంస్కారాల కోసం అంబేద్కర్ స్నేహ సంఘం(Ambedkar Friends Association) గౌరవ అధ్యక్షులు ముడిమడుగుల శంకర్ రూ. 5 వేలను బాధిత కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ముడిమడుగుల మహేందర్, ఇప్ప రవి, గ్రామస్తులు పాల్గొన్నారు.