06-08-2025 01:54:46 AM
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌పై విచారణ
హైదరాబాద్ సిటీబ్యూరో, అగస్టు 5 (విజయక్రాంతి): బెట్టింగ్ యాప్స్ ప్రచారానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటుడు విజయ్ దేవరకొండ బుధవారం ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. విజయ్ దేవరకొండ విచార ణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వ స్తాయోనని ఆసక్తి నెలకొంది.
కాగా ఈ కేసు లో ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్‌ను ఈడీ అధికారులు విచారించారు. విచారణ అనంతరం, భవిష్యత్తులో ఇలాంటి బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయబోనని ఆయన అధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం. మరో ప్రముఖ నటుడు రానా దగ్గుబాటికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. అదేవిధంగా, నటి, నిర్మాత మంచు లక్ష్మిని కూడా ఆగస్టు 13న విచారణకు రావాలని ఈడీ అధికారులు ఆదేశించారు.