calender_icon.png 3 January, 2026 | 12:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయ్ హజారేకు మళ్లీ స్టార్ ఎట్రాక్షన్

03-01-2026 12:00:00 AM

బరిలో కోహ్లీ, గిల్, జడేజా, రాహుల్

బెంగళూరు, జనవరి 2: భారత క్రికెట్ దేశవాళీ టోర్నీ విజయ్ హజారేను ఈ సారి ఫ్యాన్స్ బాగా ఫాలో అవుతున్నారు. పలువురు స్టార్ ప్లేయర్స్ ఆడుతుండడమే దీనికి కారణం. తొలి రౌండ్ మ్యాచ్‌లలో కోహ్లీ, రోహిత్ శర్మ ఆడడంతో హైప్ మొదలైంది. మళ్లీ ఇప్పుడు శనివారం జరగబోయే మ్యాచ్ లలో కోహ్లీతో పాటు చాలా మంది టీమిండియా స్టార్ ప్లేయర్స్ బరిలోకి దిగుతున్నా రు.  సర్వీసెస్ జట్టుతో జరిగే మ్యాచ్ లో ఢిల్లీ తరపున విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటి వరకూ ఆడిన 2 మ్యాచ్ లలోనూ కోహ్లీ అదరగొట్టాడు. ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. న్యూజిలాం డ్ వన్డే సిరీస్‌కు ముందు కోహ్లీ ఆడే చివరి మ్యాచ్ ఇదే. మరోవైపు భారత కెప్టెన్ శుభమన్ గిల్ కూడా విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్నాడు.

కివీస్‌తో వన్డే సిరీస్ కంటే ముందు పంజాబ్ తరపున రెండు దేశవాళీ మ్యాచ్‌లు ఆడనున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్ అనంతరం గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. ఫా మ్ కోల్పోవడంతో టీ20 ప్రపంచకప్ జట్టు లో చోటు దక్కలేదు. ఈ క్రమంలోనే గా యం నుంచి కోలుకున్న గిల్ ఫామ్ అందుకునేందుకు విజయ్ హజారే ట్రోఫీలో సిక్కిం, గోవాతో జరిగే మ్యాచ్లలో అతడు బరిలోకి దిగనున్నాడు. అలాగే కేఎల్ రా హుల్, రవీంద్ర జడేజా, హైదరాబాద్ ప్లేయ ర్స్ తిలక్ వర్మ, మహ్మద్ సిరాజ్ కూడా విజ య్ హజారే ట్రోఫీ ఆడబోతున్నారు. జాతీ య జట్టు ఎంపికలో దేశవాళీ టోర్నీల్లో ప్రదర్శనే పరిగణలోకి తీసుకుంటామని బీసీసీఐ సెలక్టర్లు స్పష్టం చేయడంతో యువ ఆటగాళ్లు, సీనియర్లు బరిలో నిలిచారు.