calender_icon.png 3 January, 2026 | 12:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రికెట్‌కు ఖవాజా గుడ్ బై

03-01-2026 12:00:00 AM

సిడ్నీ టెస్టుతో కెరీర్ ముగింపు

సిడ్నీ, జనవరి 2: ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. యాషెస్ సిరీస్లో  ఐదో టెస్టు.. అంతర్జాతీయ క్రికెట్లో తన చివరి మ్యాచ్ అని వెల్లడించాడు. ఇస్లామాబాద్లో జన్మించిన ఖవాజా చిన్న వయసులోనే ఆస్ట్రేలియాకు వలస వచ్చాడు. ఆ దేశపు తొలి ముస్లిం క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా తరఫున అనేక మ్యాచ్లు ఆడాననీ, తన తల్లిదండ్రులు ఆస్ట్రేలియాకు వచ్చి ఇక్కడే బతుకుదెరువు చూసుకున్నారనీ, వారి త్యాగాల కారణంగానే ఉన్నత శిఖరాలకు చేరుకోగలిగాననీ గుర్తు చేసుకున్నాడు. 2011 లో ఆస్ట్రేలియా తరఫున ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్‌తో సిడ్నీ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్తో ఎంట్రీ ఇచ్చిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. తన కెరీర్లో ఇప్పటికి 88 టెస్టులు, 40 వన్డేలు, 9 టీ20 మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో ఇప్పటికి 16 సెంచరీల సాయంతో 6206 పరుగులు సాధించిన ఉస్మాన్ ఖవాజా.. వన్డేల్లో 1554 రన్స్ చేశాడు.