calender_icon.png 23 January, 2026 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాలను నిర్భయంగా వెల్లడిస్తున్న విజయక్రాంతి

23-01-2026 12:00:00 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జనవరి 22: సమాజంలో నిత్యం ప్రజల సమస్యలపై స్పందిస్తూ నిజాలను నిర్భయంగా వెల్లడిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న పత్రిక విజయక్రాంతి అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందులు సామేలు అన్నారు.గురువారం మండలంలోని వేల్పుచర్ల గ్రామంలో విజయక్రాంతి దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమంలో పుట్టి,నిజాలను నిర్భయంగా వెలికి తీసి యావత్ తెలంగాణ మనస్సులో విజయక్రాంతి దినపత్రిక నిలిచిందన్నారు.ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర కీలకమైందని పాత్రికేయులు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలని కోరారు.

విజయక్రాంతి దినపత్రిక మరింత మనుగడ సాధించాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్,ఎంపీడీఓ ఝాన్సీ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరపాక సత్యం,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు వేల్పుల రమేష్,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుడిపెల్లి మధుకర్ రెడ్డి,రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కోఆర్డినేటర్ జీడి వీరస్వామి,పీఏసీఎస్ మాజీ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శిగ నసీర్ గౌడ్,సర్పంచ్ చెరుకు వెంకటమ్మ, విజయక్రాంతి రిపోర్టర్ వూర సంపత్ కుమార్ పాల్గొన్నారు.