calender_icon.png 4 November, 2025 | 8:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పనుల గుర్తింపుకు గ్రామ సభలు

04-11-2025 04:09:01 PM

వాంకిడి,(విజయక్రాంతి): మండలములోని కనార్గాం, పాటగూడ, చిచ్చుపల్లి, గోయగాం గ్రామపంచాయతీలలో ఉపాధి హామీ పథకంలో రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్లానింగ్ ప్రాసెస్ లో భాగంగా కొత్త పనుల గుర్తింపు కోసం మంగళవారం గ్రామ సభలు  నిర్వహించారు.  కనార్గావ్ గ్రామ సభకు హాజరు అయిన ఉపాధి హామీ ఏపీఓ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో గత సంవత్సరం జరిగిన పనుల వివరాలు, కూలీలకు చెల్లించిన వేతనాలు వివరించారు.

కొత్త పనుల కొరకు రైతులు స్థానిక పంచాయతీ కార్యదర్శి దగ్గర జాబ్ కార్డ్ , పట్టా పాస్ బుక్  జిరాక్స్ లతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో అనుమతించబడిన పనుల జాబితాను గ్రామ సభలో ప్రజలకు చదివి వినిపించారు.  గ్రామ సభలో  సాంకేతిక సహాయకుడు బొమ్మెన వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి సౌమ్య, క్షేత్ర సహాయకుడు రాజ్ కుమార్, పెసా మొబిలైజర్, ఉపాధి హామీ కూలీలు, రైతులు పాల్గొన్నారు.